ఆది, సింహాద్రి తర్వాత కథ లో ఎలాంటి మార్పులు, చేర్పులు లేకుండా ఒప్పుకుని చేసిన చిత్రం ఊసరవెల్లి అని
Jr NTR ఇది వరకే చెప్పాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో కష్టపడి ఊహించని మలుపులతో అవసరానికి తగ్గట్టు ప్రవర్తించేలా (రంగులు మార్చే) ఉండేటటువంటి హీరో క్యారెక్టర్ ని మలిచాడు. ఇక కథాంశంలో కి వస్తే .........
కథ : టోనీ (Jr NTR) అటు లవర్ బాయ్ గా, ఇటు అవసరానికి అనుకూలంగా ప్రవర్తించేలా పాత్ర లో అబిమానుల అంచనాలకు తగ్గకుండా నటించాడు. కాశ్మీర్ లో అనుకోకుండా ఉగ్రవాదుల చేతిలో kidnap అయి నిహారిక (Tamanna) ని కలుస్తాడు.అలా తనతో ప్రేమ లో పడిపోతాడు, కానీ అప్పటికే నిహారిక కి హోం మినిస్టర్(తనికెళ్ళ భరణి) కొడుకు తో పెళ్లి నిర్ణయం అయి ఉంటుంది. ఈ విషయం తనకి (తమన్నా కి) లవ్ propose చేసే వరకు టోనీ కి తెలియదు. ఒక 15 రోజులు నిన్ను ట్రై చేస్తా అప్పటికి నీకు నచ్చకుంటే lite తేసుకోమని చెప్పి తన లైఫ్ లోకి ఎంటర్ అవుతాడు టోనీ. లవర్ లా ట్రై చేస్తూ చివరకి ఫ్రెండ్ లా సెటిల్ అవుతాడు. హీరొయిన్ స్నేహితురాలిగా పాయల్ ఘోష్ ( ప్రయాణం ఫేం) నటించింది.
రఘు బాబు batch తో కామెడీ scenes ఆకట్టుకున్నాయి. హోం మినిస్టర్ కొడుకు కి ఉన్న మాఫియా సంబందాలను నిజ స్వరూపాన్ని బయట పెట్టి నిహారిక తనని ప్రేమించేలా చేస్తాడు.
ఫ్లాష్ బ్యాక్ లో నిహారిక brother మాఫియా batch పోలిస్ ( under cover cop ) గా పని చేస్తుంటాడు.ఈ విషయం అతని superiror కి తప్పించి ఎవరికీ (ఫ్యామిలీ మెంబెర్స్ కి కూడా )తెలియదు. అజ్జు భాయ్ (ప్రకాష్ రాజ్, మాఫియా డాన్ ) గురించి తయారు చేసిన నివేదిక ని తన ఫై అధికారికి ఇచ్చి తనని పోలిస్ ఆఫీసర్ గా అందరికి చెప్పమని చెపుతాడు( నిహారిక అన్న).తన ఫై అధికారి అజ్జు భాయ్ తో చేతులు కలిపి ( అతనిని,అతని ఫ్యామిలీ ని అజ్జు భాయ్ చంపెసేయగా..... నిహారిక అందులో నుండి తల కి బుల్లెట్ తగిలిన గాయం తో చావు నుండి తప్పించుకుంటుంది ) తనని ప్రపంచానికి క్రిమినల్ గా పరిచయం చేస్తాడు .
అజ్జు భాయ్ ని అతని అనుచరులను చంపడానికి టోనీ ని ఎంచుకుంటుంది. అజ్జు భాయ్ ని అతని అనుచరులను చంపడానికి నిహారిక కి ఇచ్చిన మాట మీద నిలబడి టోనీ అందరిని చంపేస్తాడు
కథ లో ఊహించని మలుపు ఏంటంటే నిహారిక తల కి తగిలిన బుల్లెట్ వలన గతం మర్చిపోతుంది. టోనీ అందరిని ఎందుకు చంపుతున్నాడో సెకండ్ హాఫ్ లో అందరికి తెలుస్తుంది.
కథనం: ఫస్ట్ హాఫ్ అంతా సరదా గా సాగిపోతుంది. Jr NTR introduction సీన్ చాలా బాగుంది. ఫస్ట్ 20 నిముషాలు సాదారణంగా ఉన్నా...ఫస్ట్ హాఫ్ చివరి 40 నిముషాలు చాలా బాగుంది. తను అనుకున్న వాళ్ళని చంపడానికి సర్కార్ (జయ ప్రకాష్ రెడ్డి ) batch ని ఉపయోగించుకున్న విధానం చాలా బాగుంది. సర్కార్ తో ఉండే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .
సెకండ్ హాఫ్ ....ఫస్ట్ హాఫ్ అంత లేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే కొంచెం ఎక్కువ లాగాడు అనిపిస్తుంది. చివరి fight ఆకట్టుకునేల లేదు.
నటీ నటుల పని తీరు: Jr NTR , తమన్నా ఇద్దరు చాలా బాగా నటించారు.NTR ఇటు లవర్ బాయ్ physic లేకున్నా ఆ లోటు కనపడకుండా చూసుకున్నాడు. తమన్నా ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో బాగా నటించింది. తమన్నా కి నటన కి అవకాశం ఉన్న పాత్ర దక్కింది. ప్రకాష్ రాజ్ ఇది వరకే నటించిన మాఫియా డాన్ పాత్ర లో నటించాడు. రఘు బాబు, జయ ప్రకాష్ రెడ్డి ఆకట్టుకున్నారు. పాయల్ ఘోష్ స్నేహితురాలిగా తన పరిధి మేరకు నటించింది.
సంగీతం: పాటలు అద్భుతం అని చెప్పలేం కానీ...దేవి శ్రీ ఇమేజ్ కి తగ్గట్టు లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా కి plus .
ఇక డాన్స్ విషయానికి వస్తే....NTR కి తగ్గట్టు డాన్స్ లు లేవు. Daandiyaa పాట ఆకట్టుకుంది. నిహారిక...నిహారిక సాంగ్ లో తమన్నా make అప్ సరిగ్గా లేదు. ఫస్ట్ హాఫ్ లో 4 సాంగ్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ చివర్లో వచ్చే ELANGO ELANGO సాంగ్ చిత్రీకరణ సరిగ్గా లేదు.
సాంకేతిక వర్గం:
రసూల్ ఎల్లోర్ కెమెరా పనితనం బాగుంది. గౌతం రాజ్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. వంశి రాసిన స్క్రిప్ట్ బాగుంది. కొరటాల శివ Dialouges చాలా వరకు బాగున్నాయి. సురందర్ రెడ్డి NTR ని ఇది వరకు చూపించని పాత్ర లో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.ఇటు లవర్ బాయ్ గా చూపించినా అటు మాస్ అంశాలను కమర్షియల్ సినిమా కు ఉండేలా చూసుకున్నాడు.
PLUS పాయింట్స్:
- ntr నటన, dialouges
- తమన్నా glamour అండ్ పెర్ఫార్మన్స్.
- రఘు బాబు, జయ ప్రకాష్ రెడ్డి కామెడీ సీన్
- లాస్ట్ 40 minitues ఇన్ ఫస్ట్ హాఫ్.
- ఇంటర్వెల్ కి ముందు విలన్ తమ్ముడిని చంపే సీన్.
MINUS పాయింట్స్:
- Music
- ప్రకాష్ రాజ్ charcater
- లాస్ట్ fight
- సెకండ్ హాఫ్ చాలా స్లో గా ఉండటం.
- హీరో కి విలన్ కి మద్య సినిమా ఎన్డింగ్ లో తప్ప మిగత చోట్ల సన్నివేశాలు లేకపోవడం చాలా minus
చివరగా: ఎందుకోసం అందరిని చంపుతున్నాడో హీరొయిన్ కి తెలియక పోవడం, emotion scenes ఒక వరకు minus ...బట్ స్టొరీ weight ఉన్న మూవీ. హీరో కి విలన్ కి మద్య సినిమా ఎన్డింగ్ లో తప్ప మిగత చోట్ల సన్నివేశాలు లేకపోవడం చాలా minus ... కానీ ఊసరవెల్లి రంగులు, హంగులు మాస్ ప్రేక్షకుల మీదే ఆధార పడి ఉంది.
Review By - Mr. Lakshmikanth (lakshmikanthrdy@gmail.com)
Review By - Mr. Lakshmikanth (lakshmikanthrdy@gmail.com)